: మేము ఏ పార్టీని భుజానికెత్తుకోం: ఏపీఎన్జీవో


సమైక్యాంధ్ర ఉద్యమ సందర్భంగా తాము ఏ రాజకీయ పార్టీని భుజానికెత్తుకోబోమని ఏపీఎన్జీవో అధ్యక్షుడు, సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక చైర్మన్ అశోక్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాదులోని ఏపీఎన్జీవో భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామాలు చేయకుండా రాష్ట్ర విభజనను ఏ విధంగా అడ్డుకుంటారో నేతలు ప్రజలకు వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఉద్యమం నేపథ్యంలో తాము ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదన్నారు. ఏడు లక్షల మంది ఉద్యోగులు సమ్మెలో ఉన్నా, ఎవరికీ నష్టం వాటిల్లలేదని తెలిపారు. త్వరలోనే హైదరాబాదులో సద్భావన సభ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని అశోక్ చెప్పారు.

  • Loading...

More Telugu News