: బొత్స మరో ప్రయత్నం
రాష్ట్ర రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సీమాంధ్రలో ఆర్టీసీ సమ్మె విరమింపజేసేందుకు మరోసారి నడుంబిగించారు. కొద్దరోజుల క్రితం ఆయన ఆర్టీసీ కార్మిక సంఘాలతో జరిపిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. తాజాగా నేడు ఎంప్లాయీస్ యూనియన్ (ఈయూ) నేతలతో మరోసారి భేటీ అయ్యారు. ప్రధానంగా, ఈయూ ఆర్టీసీని ప్రభుత్వ విభాగంగా గుర్తిస్తే సమ్మె విరమించేందుకు సిద్ధమని ప్రకటించింది.