: బాల నేరస్థుల వయసు తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం వెనకడుగు


బాల నేరస్థుల చట్టాల్లో మార్పుల కోసం ఏర్పాటు చేసిన జస్టిస్ జేఎస్ వర్మా కమిటీ బాల నేరస్థుల వయసు తగ్గించేందుకు ఎలాంటి సూచన చేయలేదని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి మంత్రి కృష్ణ తీర్థ చెప్పారు. బాలనేరస్థుల చట్టం,2000 ప్రకారం బాలనేరస్థుల గరిష్ఠ వయో పరిమితి 18. ఢిల్లీ అత్యాచారం కేసుతో తెరపైకి వచ్చిన బాలనేరస్థుల వయసు 16 సంవత్సరాలకు తగ్గించాలని డిమాండ్లు వినిపించాయి. 

దీనిపై స్పందించిన ప్రభుత్వం వర్మ కమిటీని ఏర్పాటు చేసింది. అయితే పిల్లలను సత్ప్రవర్తన కలిగించి..సరైన దారిలో పెట్టాలని కృష్ణ తీర్థ చెప్పారు. అందుకే ఈ వ్యవహారంపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. అందరి సూచనలను మహిళా, శిశు సంక్షేమ శాఖ  పరిశీలిస్తోందని ఆమె అన్నారు.

  • Loading...

More Telugu News