: కిరణ్ స్టార్ బ్యాట్స్ మన్ కాదు, నైట్ వాచ్ మన్: హరీశ్ రావు


టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు సీఎం కిరణ్ పై ధ్వజమెత్తారు. ఓ ప్రాంతానికే ముఖ్యమంత్రిలా వ్యవహరిస్తున్న కిరణ్ కుమార్ రెడ్డి స్టార్ బ్యాట్స్ మన్ కాదని, ఆయన నైట్ వాచ్ మన్ మాత్రమే అని ఎద్దేవా చేశారు. హైదరాబాదులో పుట్టినంత మాత్రాన కిరణ్ తెలంగాణ వ్యక్తి కాలేడని అన్నారు. కిరణ్ విత్తనం సీమాంధ్రదే అని వివరించారు. కిరణ్ ఇంటికి కరెంట్ కట్ చేయడం ఐదు నిమిషాల పని అని చెప్పారు. ప్రస్తుతం సీమాంధ్రలో జరుగుతున్న ఉద్యమం ప్రజలపైనా? ప్రభుత్వంపైనా? అన్న విషయం అర్థంకావడం లేదన్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరపుకోలేని స్థాయికి తెలంగాణవాళ్ళను సీమాంధ్ర పాలకులు దిగజార్చారని హరీశ్ రావు ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News