: సీమాంధ్ర సమావేశాన్ని అడ్డుకున్న పోలీసులు


హైదరాబాదులో కూకట్ పల్లి సమీపంలో ఉన్న వివేకానందనగర్లో కొందరు సమైక్యవాదులు ఏర్పాటు చేసుకున్న రౌండ్ టేబుల్ సమావేశాన్ని పోలీసులు అడ్డుకున్నారు. మాజీ డీజీపీ ఆంజనేయరెడ్డి, కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి వేణుగోపాల్ రెడ్డితో పాటు మరికొందరు ఏపీఎన్జీవో నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. దీనికి సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు.. సమావేశానికి అనుమతి లేదంటూ అక్కడున్న వారిని అదుపులోకి తీసుకుని, మియాపూర్ పీఎస్ కు తరలించారు. దీంతో, సమావేశం జరుపుకునే హక్కు అందరికీ ఉంటుందని.. తమను అదుపులోకి తీసుకోవడం హక్కులను కాలరాయడమేనని సమైక్యవాదులు ఆరోపించారు.

  • Loading...

More Telugu News