: సీబీఐ మీద నమ్మకం తగ్గిపోతోంది: రేవంత్ రెడ్డి
టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు విషయంలో సీబీఐ మీద నమ్మకం తగ్గిపోతోందని వ్యాఖ్యానించారు. జగన్ కేసు మూసివేసేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, వైఎస్సార్సీపీ లాలూచీ పడ్డాయని ఆరోపించారు. అందుకే జగన్ కేసులో పురోగతి మందగించిందని అన్నారు. జగన్ కంపెనీల్లోకి వచ్చిన విదేశీ నిధులపై విచారణ ఇంతవరకు జరగనేలేదన్నారు. జగన్ అక్రమాస్తులపై విచారణను వేగవంతం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.