: ప్రధాని పదవి రాహుల్ కు చాలా చిన్న విషయం: కాంగ్రెస్
దేశానికి కావాల్సింది సమర్థ నేత అని, కేవలం ప్రధానమంత్రిగా మిగిలిపోయే వ్యక్తి కాదని కాంగ్రెస్ పార్టీ అంటోంది. రాహుల్ కు ఆ సమర్థత మెండుగా ఉందని ఆ పార్టీ కొనియాడింది. ఏఐసీసీ అధికార ప్రతినిధి భక్త చరణ్ దాస్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని పదవి రాహుల్ గాంధీకి చాలా చిన్న విషయమని చెప్పారు. నెహ్రూ-గాంధీ వారసుడు రాహుల్ కు ప్రధాని పదవి ఏమంత ముఖ్యం కాదని పేర్కొన్నారు. రాహుల్ లా పేదలకోసం పోరాడే వ్యక్తే దేశానికి నాయకత్వం వహించాలని, అది జాతీయ అవసరం అని అన్నారు.