: ఆశారాం కేసులో రాంజెఠ్మలానీ నీచమైన వాదన!


రాంజెఠ్మలానీ.. దేశంలో నెంబర్ వన్ క్రిమినల్ లాయర్. ఆ స్థాయి వ్యక్తి న్యాయస్థానంలో ఎంత హుందాగా వ్యవహరించాలి?, ఎంత సభ్యతతో వాదనలు వినిపించాలి? కానీ, ఈ పెద్దాయన మరో పెద్దమనిషిని కేసు నుంచి బయటపడేసేందుకు నీచమైన వాదనలు వినిపించారు. వివరాల్లోకెళితే.. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆశారాం బాపు తనపై అత్యాచారం చేశారని ఓ బాలిక చేసిన ఫిర్యాదుపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను రిమాండ్ కు తరలించారు. ఆశారాం బాపు బెయిల్ పిటిషన్ పై నేడు జోథ్ పూర్ హైకోర్టు బెంచ్ లో విచారణ జరుగుతోంది. ఈ సందర్భంగా డిఫెన్స్ న్యాయవాది రాంజెఠ్మలానీ దారుణంగా వ్యాఖ్యానించారు. ఆశారాం బాపుపై ఫిర్యాదు చేసిన బాలిక గతకొంతకాలంగా పురుషుల ఆకర్షణకు లోనయ్యే జబ్బుతో బాధపడుతోందని కోర్టుకు విన్నవించారు. ఈ వ్యాధి ఉన్న మహిళలు.. పురుషుల వెంటపడతారని వివరించారు. డిఫెన్స్ వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి విచారణను రేపటికి వాయిదా వేశారు.

  • Loading...

More Telugu News