: జగన్ రిమాండ్ మార్చి 13 వరకు పొడిగింపు
అక్రమాస్తుల కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్న వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రిమాండ్ ను మార్చి 13 వరకు పొడిగిస్తూ సీబీఐ కోర్టు ఈ రోజు నిర్ణయం తీసుకుంది. ఇదే కేసులో అరెస్టై జగన్ తో పాటు చంచల్ గూడ జైల్లో ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ (మ్యాట్రిక్స్), మాజీ మంత్రి మోపిదేవి వెంకట రమణ, బ్రహ్మానంద రెడ్డి తదితరులకు కూడా మార్చి 13 వరకు రిమాండ్ పొడిగిస్తూ కోర్టు తీర్పునిచ్చింది.