: సీమాంధ్రలో వైద్య సేవలు బంద్
సమైక్య రాష్ట్రంకోసం సీమాంధ్రలో ఈ రోజు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఈ మేరకు ప్రైవేటు వైద్యశాలలు బంద్ ప్రకటించాయి. అయితే, అత్యవసర సేవలకు మినహాయింపునిచ్చారు. సుమారు 40వేల మంది డాక్టర్లు బంద్ నిర్వహిస్తున్నారు. వీరితో పాటు మందుల షాపుల యజమానులు కూడా స్వచ్ఛంధంగా బంద్ పాటిస్తున్నారు. అటు రక్త పరీక్షా కేంద్రాలు కూడా మూతబడ్డాయి. ఇక మెడికల్ కళాశాలలపైనా బంద్ ప్రభావం పడింది. వైద్య విద్యార్థులు పలు ప్రాంతాల్లో ర్యాలీలు నిర్వహిస్తున్నారు.