: కావూరికి సమైక్య సెగ
కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావుకు సమైక్య సెగ తగిలింది. పశ్చిమ గోదావరి జిల్లా కలపర్రు చెక్ పోస్టు వద్ద ఆయనను సమైక్యవాదులు అడ్డుకున్నారు. పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్రకు మద్దతివ్వాలని వారు డిమాండ్ చేశారు. సమైక్యవాదులకు కావూరి ఎంత నచ్చజెప్పబోయినా వారు వినలేదు. దీంతో కావూరి మరో వాహనంలో ఏలూరు వెళ్లారు.