: వజ్రాల వయసును లెక్కించవచ్చు
వజ్రాలకు ఎంత వయసుంటుంది... ఏమో ఎలా తెలుస్తుంది... కార్బన్ డేటింగ్ వంటి వాటిద్వారా తెలుసుకోవచ్చు. అయితే ఫలానా కాలంలో ఏర్పడింది అనే విషయాన్ని మాత్రమే దీనిద్వారా తెలుసుకోగలం కానీ ఇన్ని సంవత్సరాలు అని కచ్చితంగా చెప్పగలమా... చెప్పలేము. అయితే వజ్రాల వయసును లెక్కించడానికి కూడా మార్గం ఉంది. చెట్ల వయసును లెక్కించడానికి వాటిలో వార్షిక వలయాలుంటాయి. వాటిని లెక్కించడం ద్వారా ఒక చెట్టు వయసును చక్కగా నిర్ధారించి చెప్పగలం. అలాగే వజ్రాల్లో కూడా వార్షిక వలయాలుంటాయట. వాటిని లెక్కించడం ద్వారా ఒక వజ్రం వయసును నిర్ధారించి చెప్పవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.
ఒక వజ్రం తయారుకావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుందట. భూగర్భంలో అత్యధిక ఉష్ణోగ్రతల కారణంగా అపరిమితమైన ఒత్తిడికి గురయ్యే కర్బన అణువులే వజ్రాలుగా రూపాంతరం చెందుతాయి. అయితే వజ్రాల వయసును ఎలా లెక్కించగలం... అంటే వృక్షాల తీరులాగానే వజ్రాల్లో కూడా వార్షిక వలయాలు ఏర్పడతాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాటిని లెక్కించడం ద్వారా వజ్రాల వయసును గుణించవచ్చని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. భూగర్భంలోని ఉష్ణోగ్రతల్లో మార్పులు, ఆయా ప్రాంతాల్లో రసాయన సమ్మేళనాల్లో కలిగే మార్పులు, చేర్పులు అన్నీ కలగలిపి వజ్రాల్లో వలయాలు ఏర్పడటానికి కారణమవుతాయి. ఈ వలయాలను లెక్కించడం ద్వారా వజ్రాల వయసును లెక్కగట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.