: టూ ఇన్ వన్ టాబ్లెట్!
క్యాన్సర్ వ్యాధిని అరికట్టేందుకు ఉపయోగించే ఒక ఔషధం షుగరు వ్యాధిని కూడా నివారిస్తే... అప్పుడు రెండు వ్యాధులకు ఒకే మందును ఉపయోగించవచ్చు. క్యాన్సరు వ్యాధికి ఉపయోగించే ఒక ఔషధం షుగరు వ్యాధిని కూడా అదుపులో ఉంచేందుకు ఉపకరిస్తున్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు.
స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ప్రత్యేక అధ్యయనంలో క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఉపయోగించే ఒక ఔషధం మధుమేహ చికిత్సలో కూడా ఉపకరిస్తున్నట్టు గుర్తించారు. వీరు తమ పరిశోధనలో షుగరు వ్యాధి పెరగడంలో కీలక పాత్ర పోషిస్తున్న పరమాణు మార్గాన్ని గుర్తించారు. ఈ మార్గాన్ని అప్లిబెర్‌సెప్ట్ అనే ఔషధం నియంత్రిస్తున్నట్టు శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ ఔషధాన్ని మార్కెట్లో ఈలియా లేదా జాల్‌ట్రాప్‌గా వ్యవహరిస్తారు. దీన్ని పురీషనాళ క్యాన్సర్ వ్యాధి చికిత్సలో ఉపయోగిస్తారు. ఇది ఇటు షుగరు వ్యాధిని అదుపులో ఉంచడంలో కూడా తోడ్పడుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు.