: ఇంటి భోజనానికి జగన్ కు నిరాకరణ.. మోపిదేవికి బెయిల్
చంచల్ గూడ జైలులో వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఇంటి భోజనాన్ని అనుమతించాలన్న పిటిషన్ ను సీబీఐ కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఆయన కుటుంబసభ్యులు వేసిన పిటిషన్ ను న్యాయస్థానం కొట్టివేసింది. మరోవైపు జగన్ అక్రమాస్తుల కేసులో మాజీమంత్రి మోపిదేవి వెంకటరమణకు కోర్టు అక్టోబర్ 31 వరకు మధ్యంతర బెయిల్ ను మంజూరు చేసింది. ఇందుకు ఇద్దరు వ్యక్తులు లక్ష రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశించింది.