: బాబా రాందేవ్ కు ఊరట


యోగా గురు బాబా రాందేవ్ కు హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు ఉపశమనం కల్పించింది. బాబాకు సంబంధించిన పతంజలి యోగ పీఠం భూములను హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం ఈ నెల 22న బలవంతంగా లాక్కున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ భూముల విషయంలో ప్రభుత్వానికి పతంజలి యోగ పీఠానికి మధ్య కుదిరిన లీజు ఒప్పందంపై యథాతథ స్థితిని కొనసాగించాలని హైకోర్టు ఆదేశించింది.

పతంజలి యోగ పీఠానికి 2010లో బీజేపీ ప్రభుత్వం సోలన్ జిల్లా సాధుపల్ వద్ద 98 ఎకరాలను లీజు కింద కేటాయించింది. ఇటీవల అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో.. బాబాకు భూ కేటాయింపులను రద్దు చేస్తూ ఈ నెల 19న కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీనిపై పతంజలి యోగ పీఠం హైకోర్టును ఆశ్రయించింది. నేడు ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ధర్మాసనం భూముల లీజు విషయంలో అంతకు ముందున్న యథాతథ స్థినిని కొనసాగించాలని ఉత్తర్వులు జారీ చేసింది. 

  • Loading...

More Telugu News