: అసెంబ్లీని సమావేశపర్చండి: జేపీ డిమాండ్
రాష్ట్ర విభజన అంశంపై లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ స్పందించారు. హైదరాబాదు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అసెంబ్లీని సమావేశ పరచాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న సంక్షోభానికి పరిష్కారం చూపాల్సిన బాధ్యత చట్టసభలపై ఉందని ఉద్ఘాటించారు. రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చిందంటూ కేంద్రంపై మండిపడ్డారు. రాష్ట్ర విభజన అంశాన్ని కేంద్రం రాజకీయ, ఎన్నికల కోణంలోనే చూడడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. ఈ సమస్య పరిష్కారానికి కేంద్రం తక్షణమే సంయుక్త పార్లమెంటరీ సంఘాన్ని గానీ, అధికారిక కమిటీని గానీ నియమించాలని జేపీ సూచించారు.