: దోచుకునేందుకే సమైక్య ఉద్యమం: కోదండరాం


తెలంగాణ పొలిటికల్ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం సమైక్య ఉద్యమంపై స్పందించారు. కొందరు పెట్టుబడిదారులు మరింత దోచుకునేందుకే సమైక్య ఉద్యమాన్ని ఎగదోస్తున్నారని ఆరోపించారు. సమైక్య ఉద్యమం ప్రజాస్వామికం కాదని అన్నారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. ఆధిపత్యం, దోపిడీ కోసమే పుట్టుకొచ్చిన ఉద్యమమని విమర్శించారు. సీమాంధ్రలో ఉద్యమం పేరిట ఆర్టీసీని నాశనం చేసి ట్రావెల్స్ కు దోచిపెడుతున్నారని కోదండరాం దుయ్యబట్టారు. తెలంగాణ కోసం బలమైన ఉద్యమాన్ని నిర్మించింది టీఆర్ఎస్ పార్టీయేనని ఉద్ఘాటించారు. ఇక హైదరాబాదును పారిశ్రామికంగా అభివృద్ధి చేసింది నిజాంలేనని కోదండరాం చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News