: ఢిల్లీ వెళ్ళేందుకు బాబు సిద్ధం
పార్టీ ముఖ్య నేతలతో కలిసి ఢిల్లీ పర్యటనకు వెళుతున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఈ నెల 20 లేదా 21న వెళ్లనున్నట్లు తెలిపారు. పర్యటనలో పార్టీ పార్లమెంట్ సభ్యులు, ఇతర నేతలను వెంటబెట్టుకుని రాష్ట్రపతిని, ప్రధానమంత్రిని కలవనున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న ఉద్యమం, సమ్మెలపై చర్చించనున్నారు. రాష్ట్ర విభజన ప్రకటన విషయంలో ఇరు ప్రాంతాల వారికి న్యాయం చేయాలన్న విషయంపై కూడా చర్చిస్తారు.