: తెలంగాణ ప్రకటనలో ఉపాధ్యాయుల పాత్ర కీలకం: జానారెడ్డి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన విషయంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి జానారెడ్డి అన్నారు. వారికి పదో పీఆర్సీ ఆలస్యమైతే తాత్కాలిక పరిహారం ఇప్పించడంలో తనవంతు కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. ఉపాధ్యాయుల ఉమ్మడి సర్వీసు రూల్స్ కు అవరోధంగా ఉన్న ఆర్టికల్ 371 డి సవరణపై చర్చిస్తామని జానారెడ్డి పేర్కొన్నారు. కాగా, రాష్ట్ర విభజన జరిగితే ఏదో జరిగిపోతుందని సీమాంధ్ర ఉద్యోగులు అనవసరంగా గగ్గోలు పెడుతున్నారన్నారు.