: ఆశారాం బాపుకు రిమాండ్ పొడిగింపు
లైంగిక వేధింపుల కేసులో ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు జోధ్ పూర్ సెషన్స్ కోర్టు 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీని పొడిగించింది. అంతకుముందు విధించిన పద్నాలుగు రోజుల రిమాండ్ గడువు నేటితో ముగియడంతో ఆశారాంను పోలీసులు న్యాయస్థానం ఎదుట ప్రవేశపెట్టారు. మరోవైపు, ఆశారాం బెయిల్ పిటిషన్ ను రాజస్థాన్ హైకోర్టు తిరస్కరించింది. కాగా, ఆశారాం అనుచరులు తమను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని బాలిక కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోన్ లో రికార్డ్ అయిన సంభాషణలను న్యాయస్థానానికి సమర్పించనున్నారు.