: ఏపీఎన్జీవోల సమ్మెపై విచారణ వాయిదా
విభజన ప్రకటన నేపథ్యంలో కొనసాగుతున్న ఏపీఎన్జీవోల సమ్మెను సవాల్ చేస్తూ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై విచారణ రేపటికి వాయిదా పడింది. సమ్మెకు సంబంధించి సేవా నిబంధనలు ఉల్లంఘిస్తే తీసుకునే చర్యలు, పర్యవసానాలు ఏమిటి? సమ్మెపై ప్రభుత్వానికి చర్యలు తీసుకునే అధికారం ఉందా? లేదా? అన్నదానిపై వివరాలు తెలుపుతూ అఫిడవిట్ దాఖలు చేయాలని పిల్ వేసిన వ్యక్తిని కోర్టు ఆదేశించింది.