: ముజఫర్ నగర్ అల్లర్ల కారకులపై చర్యలు: ప్రధాని


ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ జిల్లాలో జరిగిన అల్లర్లకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ అన్నారు. ఈ నేపథ్యంలో యూపీ ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం అందిస్తామన్నారు. అల్లర్లు చోటు చేసుకున్న ప్రాంతాలను కొద్దిసేపటి కిందట ప్రధాని, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ సందర్శించారు. పలు విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్న వారు బాధితులను పరామర్శించారు. రెండు వారాల కిందట చోటు చేసుకున్న ఈ అల్లర్లలో దాదాపు 40 మందికిపైగా మరణించగా, పలువురు గాయపడ్డారు.

  • Loading...

More Telugu News