: వరంగల్ తేజస్వి ఆస్పత్రిలో భ్రూణ హత్యలు


ప్రభుత్వం లింగ నిర్థారణ పరీక్షలను నిషేధించి, కఠిన చట్టాన్ని అమలు చేస్తున్నా ధన పిపాసులు దానిని నిర్భయంగా ఉల్లంఘిస్తూనే ఉన్నారు. నేటికీ సమాజంలో ఆడ పిల్లల విషయంలో కొంత మంది ఆలోచనలు మారకపోవడం ఇలాంటి దోపిడీ దారులకు వరంగా మారుతోంది. అందరూ కలిసి కడుపులోనే శిశువులను అంతం చేసేస్తున్నారు. 

ఇలాగే లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూ, గర్భ స్రావాలు, భ్రూణ హత్యలకు పాల్పడుతున్న వరంగల్ పట్టణంలోని తేజస్వి ఆస్పత్రిలో వైద్యాధికారులు తనిఖీలు నిర్వహించారు. స్కానింగులు చేస్తూ గర్భంలోనే ఆడశిశువులను అంతం చేసేస్తున్నారని గుర్తించారు. దీంతో అధికారులు తేజస్వి ఆస్పత్రిలోని స్కానింగ్ విభాగాన్ని సీజ్ చేసి రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆస్పత్రి డాక్టర్ ను అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News