: 'చలో హైదరాబాద్' అంటున్న ప్రభుత్వ ఉద్యోగులు
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు తమ కోరికల అమలుకు ఆందోళన బాట పడుతున్నారు. ఇందులో భాగంగా మార్చి 2న 'చలో హైదరాబాద్' కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి (ఐకాస) నిర్ణయం తీసుకుంది. నిన్న హైదరాబాదులో ఐకాస ముఖ్య నేతలు సమావేశమై ఇందుకు సంబంధించిన తీర్మానాన్ని చేశారు.
10వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ) ఏర్పాటు, క్యాష్ లెస్ మెడికల్ పాలసీ (నగదు రహిత వైద్య విధానం) తదితర అంశాల అమలుకు ఉద్యోగులు గత కొంత కాలంగా పట్టుబడుతున్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రిని ఎన్నిసార్లు కలిసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఆందోళన బాట పట్టడం మినహా, తమకు గత్యంతరం లేదని ఐకాస నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. కాగా, ఈ 'ఐకాస'లో తెలంగాణా ఉద్యోగులు మినహా ఏపీ ఎన్జీఓలు, ఉపాద్యాయ సంఘాలు సభ్యత్వం కలిగి వున్నాయి.