: టీడీపీ ముఖ్యనేతలతో భేటీ కానున్న చంద్రబాబు
పార్టీ ముఖ్యనేతలతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఈ రోజు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులతో పాటు కీలక నేతలు హాజరుకానున్నారు. చంద్రబాబు ఢిల్లీ యాత్ర చేపట్టనున్న నేపథ్యంలో ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ఆయన పర్యటనకు సంబంధించిన తేదీలను ఖరారు చేయనున్నట్టు సమాచారం.