: గల్ఫ్ బాధితుల ఫిర్యాదులు అందాయి.. చర్యలు తీసుకుంటాం : వాయలార్ రవి


గత మూడు సంవత్సరాలలో గల్ఫ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలపై పలు ఫిర్యాదులు వచ్చాయని కేంద్ర ప్రవాస భారతీయ వ్యవహారాల మంత్రి వాయలార్ రవి అన్నారు. వాటిలో 2010లో 145, 2011లో 212, 2012లో 267 ఫిర్యాదులు వచ్చాయని వివరించారు. వీటిని పరిశీలించి సత్వరమే చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

అయితే 
గల్ఫ్ బాధితులను మోసం చేస్తున్న నకిలీ సంస్థలపై.. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే చర్యలు తీసుకోవాలని వాయలార్ సూచించారు. లోక్ సభలో గల్ఫ్ బాధితుల సమస్యలపై జరిగిన వాడీవేడీ చర్చలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు రవి సమాధానం ఇచ్చారు. ఉద్యోగాల కోసం విదేశాలకు వెళ్లే మహిళల కోసం కొన్ని కొత్త నిబంధనలు అమలు చేయనున్నట్లు తెలిపారు. వారే దౌత్యాధికారులను సంప్రదించేందుకు ఫోన్ సౌకర్యం కూడా కల్పిస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

  • Loading...

More Telugu News