: దక్షిణ ఇరాక్ దద్దరిల్లింది
ఇరాక్ మరోసారి నెత్తురోడింది. దక్షిణ ఇరాక్ లోని పలు పట్టణాల్లో వరుస బాంబు పేలుళ్ళు చోటు చేసుకున్నాయి. ఈ పేలుళ్ళలో 16 మంది మరణించగా, పెద్ద సంఖ్యలో గాయపడ్డారు. బార్సా పట్టణంలో 10 మంది, తిక్రిక్ పట్టణంలో ముగ్గురు, కర్బాల్ లో ఇద్దరు, హిల్లాలో ఒకరు మృతి చెందారు. సున్ని, షియా వర్గాల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే ఈ పేలుళ్ళు జరిగినట్టు తెలుస్తోంది.