: బీహార్ సీఎంపై దాడి చేస్తామంటూ పోస్టర్లు.. వ్యక్తి అరెస్టు
బీహార్ సీఎం నితీశ్ కుమార్ పై దాడి చేస్తామంటూ పాట్నాలో పోస్టర్లు అతికించిన వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ నెల 16న జరిగే జనతా దర్బారు సందర్భంగా నితీశ్ పై దాడి చేస్తామని ఆ పోస్టర్లలో పేర్కొన్నట్టు పోలీసులు తెలిపారు. సీసీటీవీ ఫుటేజి పరిశీలించగా.. క్రమం తప్పకుండా జనతా దర్బారు కార్యక్రమానికి హాజరయ్యే భీమ్ సేన్ మిశ్రా అనే వ్యక్తే పోస్టర్ల ద్వారా బెదిరింపులకు పాల్పడ్డట్టు తేలింది. అతడిని అరెస్టు చేసిన పోలీసులు విచారిస్తున్నారు. ఇతను ఆయుర్వేద వైద్యుణ్ణని, జ్యోతిష్కుడినని చెప్పుకుంటూ ఉంటాడని, కొన్నేసి సార్లు మతిస్థిమితంలేని వాడిలా ప్రవర్తిస్తుంటాడని పోలీసులు తెలిపారు.