: బాబు త్వరలో తెలంగాణలో పర్యటిస్తారు: ఎర్రబెల్లి
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తెలంగాణలో కూడా పర్యటిస్తారని పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. నేడు మీడియాతో మాట్లాడుతూ, బాబు కేంద్రానికి ఇచ్చిన లేఖను వాపసు తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోందని, అందులో వాస్తవం లేదని అన్నారు. బాబు చొరవ ప్రదర్శించడంవల్లే అఖిలపక్షం జరిగిందని చెప్పుకొచ్చారు. ఇక కాంగ్రెస్, టీఆర్ఎస్ వల్లే విభజన ప్రక్రియ ఆలస్యం అవుతోందని ఆరోపించారు.