: యువీ సెంచరీ.. భారత్-ఏ తీన్ మార్


టీమిండియాలో చోటు కోసం పరితపిస్తున్న యువరాజ్ సింగ్ బ్యాట్ ఝుళిపించాడు. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా విండీస్-ఏ జట్టుతో జరిగిన మ్యాచ్ లో యువీ సెంచరీతో విమర్శకుల నోళ్ళు మూయించాడు. కేవలం 89 బంతుల్లోనే 123 పరుగులు చేసిన యువరాజ్ భారత్-ఏ జట్టు భారీ స్కోరు సాధించడంలో ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో, నిర్ణీత 42 ఓవర్లలో ఆతిథ్య జట్టు 4 వికెట్ల నష్టానికి 312 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇక, హార్డ్ హిట్టర్ యూసుఫ్ పఠాన్ విశ్వరూపం ప్రదర్శించాడు. 32 బంతుల్లో 6 సిక్స్ లు, 4 ఫోర్లతో 70 పరుగులతో అజేయంగా నిలిచాడు. ముఖ్యంగా పఠాన్ ధాటికి చివరి ఓవర్లలో విండీస్ బౌలర్లు విలవిల్లాడారు.

  • Loading...

More Telugu News