: సిరియాపై అమెరికా, రష్యా మధ్య ఒప్పందానికి ఒబామా ఆమోదం


సిరియాపై యుద్ధమేఘాలు తొలగిపోతున్నాయి. ఆ దేశం వద్దనున్న రసాయనిక ఆయుధాలను ఐక్యరాజ్యసమితి భద్రత మండలికి అప్పగించేలా అమెరికా, రష్యా మధ్య కుదిరిన ఒప్పందానికి అగ్రరాజ్యాధిపతి బరాక్ ఒబామా సమ్మతి తెలిపారు. గతమూడ్రోజులుగా ఇదే విషయమై అమెరికా కార్యదర్శి జాన్ కెర్రీ, రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ మధ్య చర్చలు జరిగాయి. ఈ చర్చలు ఫలప్రదం కావడంతో సిరియాపై యుద్ధ నిర్ణయాన్ని తాత్కాలికంగా పక్కనబెడుతున్నట్టు ఒబామా తెలిపారు. ఈ ఒప్పందానికి సిరియా అధ్యక్షుడు అసాద్ కట్టుబడి ఉండాలని, లేని పక్షంలో కఠిన చర్యకు వెనకాడబోమని ఒబామా హెచ్చరించారు.

ఇటీవల సిరియా రాజధాని డమాస్కస్ లో తిరుగుబాటుదారులపై అక్కడి ప్రభుత్వం రసాయనిక ఆయుధాలు ప్రయోగించడంతో వెయ్యిమందికిపైగా మరణించారు. దీంతో, అమెరికా సిరియాపై యుద్ధానికి కాలుదువ్వింది. ప్రతిగా రష్యా మిత్రదేశం సిరియాకు బాసటగా మధ్యధరా సముద్రంపై యుద్ధనౌకలను మోహరించింది. తాజా ఒప్పందంతో యుద్ధభయం తొలగినట్టే కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News