: జేపీ బస్సు యాత్ర వాయిదా
తెలుగుతేజం పేరిట లోక్ సత్తా పార్టీ చేపట్టిన బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్టు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ తెలిపారు. అనంతపురంలో మాట్లాడుతూ, సమైక్యవాదుల ఆందోళనల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఢిల్లీ పెద్దలు రాష్ట్ర ప్రభుత్వాన్ని సామంతరాజులా చూడడం మానుకోవాలని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ను విభజించడానికి పూనుకున్న రీతిలో తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల జోలికెళ్ళగలరా? అని సవాల్ విసిరారు. ఆంటోనీ కమిటీ స్థానంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ), అధికారిక కమిటీలను వేయాలని డిమాండ్ చేశారు.