: 'యుద్ధభేరి' సభకు జానారెడ్డి సంఘీభావం
ఈ నెల 21న ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థి సంఘాలు నిర్వహిస్తున్న యుద్ధభేరి సభకు మంత్రి జానారెడ్డి సంఘీభావం తెలిపారు. హైదరాబాదులో మీడియాతో మాట్లాడుతూ, సభను శాంతియుతంగా నిర్వహించుకోవాలని విద్యార్థులకు సూచించారు. సభకు ఆహ్వానం అందిందని, అయితే హాజరయ్యే విషయమై పార్టీలో చర్చించాల్సి ఉంటుందని వెల్లడించారు.