: జేపీని అడ్డుకోవడం సరికాదు: కొండ్రు


తెలుగుతేజం పేరిట బస్సు యాత్ర చేస్తున్న లోక్ సత్తా పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణకు మంత్రి కొండ్రు మురళి మద్దతుగా నిలిచారు. జేపీ యాత్రకు సమైక్యవాదులు అడుగడుగునా అడ్డుపడుతుండడంపై ఆయన స్పందించారు. మీడియాతో మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో అభిప్రాయాలు చెప్పుకునే స్వేచ్ఛ ఎవరికైనా ఉంటుందని స్ఫష్టం చేశారు. జేపీ యాత్రను అడ్డుకోవడం సమంజసం కాదని సమైక్యవాదులకు కొండ్రు హితవు పలికారు.

  • Loading...

More Telugu News