: కాఫీతో క్యాన్సర్‌కు చెక్‌!


రోజూ ఉదయాన్నే కాఫీ తాగితేనే కొందరికి బద్దకం వదులుతుంది. మరికొందరికి ఉదయాన్నే కాఫీ పడకపోతే ఇక వారు పనిలో పడలేరు. ఇలా కాఫీ అనేది మన రోజువారీ జీవనంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించేసుకుంది. అలసటకు లోనైనా, పనిలో ఒత్తిడి ఎక్కువైనా, సాయంత్ర వేళల్లోను మనల్ని సేద తీర్చే ప్రత్యేక పానీయం కాఫీ. ఎక్కువ కాఫీ తాగడం మంచిది కాదని కొందరు చెబుతున్నా కాఫీ తాగడం వల్ల మహిళలకు గర్భాశయ క్యాన్సర్‌ ముప్పును తగ్గిస్తుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు.

కాఫీలో యాంటాక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని, వాటివల్ల మనం ఆరోగ్యంగా ఉండగలమని వరల్డ్‌ క్యాన్సర్‌ రీసెర్చ్‌ ఫండ్‌ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. అయితే ఈ విషయంపై ప్రత్యేకమైన పరిశోధనలు నిర్వహించి, నిరూపించిన దాఖలాలు లేవు. కానీ కాఫీలో కొన్ని మంచిచేసే లక్షణాలు ఉండడంతోబాటు అతిగా కాఫీ సేవనం వల్ల శరీరాన్ని హాని కలిగించే కారకాలు కూడా ఉన్నాయి. కాబట్టి కాఫీ తాగితే ఆరోగ్యం అని అనుకోకుండా అతి సర్వత్ర వర్జయేత్‌ అన్నట్టుగా అతిగా తీసుకోకుండా మితంగా కాఫీ తాగితే ఆరోగ్యానికి ఆరోగ్యం, మనకు కూడా ఆనందమేకదా!

  • Loading...

More Telugu News