: జీవ లయ తప్పితే రోగాలొస్తాయి
మన శరీరానికి ఒక నిర్ధిష్టమైన క్రమం ఉంటుంది. దాన్ని అనుసరించే మనం నడచుకోవాల్సి ఉంటుంది. అలాకాకుండా మన చిత్తానికి వచ్చినట్టుగా నడచుకుంటుంటే దాని ఫలితంగా మన శరీరాన్ని రోగాల నెలవుగా చేసుకొన్నవాళ్లమవుతామట. కొందరు శాస్త్రవేత్తలు నిర్వహించిన తాజా పరిశోధనల్లో మనిషి జీవగడియారానికి, శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తికి నిర్ధిష్టమైన సంబంధం ఉందని తేలింది. ఈ రెండింటి మధ్య తేడా వస్తేనే ఇన్సులిన్ ఉత్పత్తిలో తేడావచ్చి మన శరీరం రోగాల బారిన పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
శరీరంలో ఇన్సులిన్ ఉత్తత్తి అనేది ఎక్కువైనా, తక్కువైనా ప్రమాదమే. దీని ఉత్పత్తి నిర్ధిష్టంగా జరిగితేనే రోగాల దూరంగా ఉండగలం. ఈ విషయంపై అమెరికాకు చెందిన శాస్త్రవేత్తలు నిర్వహంచిన తాజా పరిశోధనలో మన శరీరంలోని జీవ గడియారానికి శరీరంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్‌కూ నిర్ధిష్ట సంబంధం ఉందని తేలింది. జీవలయ దెబ్బతింటే స్థూలకాయం, తద్వారా మధుమేహం, ఇతర హృద్రోగాలు రావచ్చని హెచ్చరిస్తున్నారు. మన శరీరంలోని ప్రతి కణాలకూ వాటికంటూ ఒక నిర్దిష్ట సమయ ప్రణాళిక ఉంటుంది. దాన్ని మెదడులోని సుప్రా`కియాస్మటిక్ కేంద్రకం నియంత్రిస్తుంది, మన రోజువారీ జీవనాన్ని బట్టి ఆ నియంత్రణ మారుతుంటుంది. దానికి తగ్గట్టుగా ఇన్సులిన్ ఉత్పత్తి కూడా మారుతుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాబట్టి జీవ లయ దెబ్బతినకుండా సరైన ఆహార నియమాలను పాటిస్తూ ఆరోగ్యంగా ఉందాం!