: నటి అంజలిపై అరెస్టు వారెంట్ ఉపసంహరణ


నటి అంజలిపై జారీ చేసిన అరెస్టు వారెంట్ ను చెన్నైలోని సైదాపేట కోర్టు ఉపసంహరించుకుంది. తమిళ దర్శకుడు కళంజియం వేసిన పరువునష్టం దావా కేసులో పలుమార్లు కోర్టుకు హాజరుకాకపోవడంపై రెండు రోజుల కిందట కోర్టు ఆమెకు వారెంట్ జారీ చేసింది. దాంతో, హాజరుకాకపోవడానికి గల కారణాలను అంజలి తరపు న్యాయవాదులు న్యాయస్థానానికి వివరించడంతో వారెంట్ ను వెనక్కుతీసుకుంది.

  • Loading...

More Telugu News