: అనంతపురం జిల్లాలో 300 గ్రామాలకు నిలిచిపోయిన కరెంట్
అనంతపురం జిల్లా కదిరి డివిజన్ లోని ఆరు సబ్ స్టేషన్లలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో డివిజన్ పరిధిలోని 300 గ్రామాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో పాటు అనంతపురంలోని సబ్ స్టేషన్ లో కూడా సాంకేతిక సమస్య ఏర్పడటంతో... కొన్ని గంటల పాటు విద్యుత్ సరఫరా ఆగిపోయింది.