: ఆంధ్రా పార్టీలన్నీ తెలంగాణకు వ్యతిరేకమే : ఈటెల


ఆంధ్రా పార్టీలన్నీ తెలంగాణ వ్యతిరేక పార్టీలేనని టీఆర్ఎస్ నేత ఈటెల రాజేందర్ విమర్శించారు. హైదరాబాదులో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రా పార్టీల పట్ల తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా లోక్ సత్తా జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణపై ఆయన మండిపడ్డారు. జేపీ తనకు తానే పెద్ద మేధావినని అనుకుంటారని విమర్శించారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు ఢిల్లీ టూర్ పై ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

  • Loading...

More Telugu News