: ఎలుగుబంటి దాడిలో ఇద్దరు మృతి


విశాఖ జిల్లాలో ఎలుగుబంటి దాడి చేసిన ఘటనలో ఇద్దరు మృతి చెందగా, మరో ముగ్గురు గాయపడ్డారు. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతమైన దంబ్రిగూడ మండలంలో ఈ ఘటన జరిగినట్టు అటవీశాఖ అధికారులు తెలిపారు. ఈ సంఘటనలో జి.బలరామ్ (49), కొర్రా సిబ్బో (51) చనిపోయారు. మృతులు గాటివలస గ్రామానికి చెందిన వారు. వీరిద్దరితోపాటు మరికొందరు గిరిజనులు సంతకు అరకు వెళుతుండగా ఎలుగుబంటి వారిపై దాడిచేసినట్టు బాధితులు తెలిపారు. ఎలుగుబంటి మొదట బలరామ్ పై దాడిచేయగా అతను అక్కడికక్కడే మరణించాడు. అతన్ని కాపాడేందుకు వెళ్లిన సిబ్బోను ఎలుగు తీవ్రంగా గాయపరచడంతో... కొంత సమయం తర్వాత అతను కూడా సంఘటన స్థలంలోనే చనిపోయాడు.

  • Loading...

More Telugu News