: నలుగురు మృగాళ్లకు ఉరిశిక్ష సబబే: అమెరికా
నిర్భయపై అత్యంత క్రూరంగా అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన నలుగురు మృగాళ్లకు ఢిల్లీ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఉరిశిక్ష విధించడాన్ని అమెరికా సమర్థించింది. నిర్భయ ధీర వనిత అని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. లైంగిక హింస అనేది అంటువ్యాధిలా విస్తరించిందన్నారు. నిర్భయ కేసులో తీర్పు భారత న్యాయవ్యవస్థపై నమ్మకాన్ని పెంచిందని అమెరికా విదేశాంగ ప్రతినిధి మేరీ హార్ప్ వ్యాఖ్యానించారు. ఈ మేరకు వాషింగ్టన్ లో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది మహిళలపై దాడులు జరుగుతున్నాయని, వీటి నిరోధానికి కఠిన చట్టాలను తీసుకురావాలన్నారు.