: అక్తర్ ను హైదరాబాద్ కు తీసుకొచ్చిన ఎన్ఐఏ
భారత్, నేపాల్ సరిహద్దుల్లో పట్టుబడిన ఉగ్రవాది అసదుల్లా అక్తర్ ను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు విచారణ కోసం హైదరాబాద్ తీసుకొచ్చారు. నిన్న రాత్రి అతడిని ఢిల్లీ నుంచి హైదరాబాద్ తీసుకొచ్చిన అధికారులు దిల్ సుఖ్ నగర్ పేలుళ్లకు ముందు ఉగ్రవాదులు నివసించినట్లు భావిస్తున్న బహదూర్ పురాలో సోదాలు నిర్వహించారు. మళ్లీ రాత్రే అతడిని ఢిల్లీకి తీసుకెళ్లారు.