: రోజూ వేలల్లో పిల్లలు చనిపోతున్నారట


ప్రపంచవ్యాప్తంగా రోజుకు 18 వేలమంది ఐదేళ్లలోపు చిన్నారులు చనిపోతున్నారట. ఐక్యరాజ్య సమితి తాజాగా ఇచ్చిన నివేదికలో ఐదేళ్లలోపు చిన్నారులు ఇలా రోజూ మృత్యువాత పడుతున్నట్టు వెల్లడించింది. 2012లో మొత్తం 66 లక్షల మంది చిన్నారులు చనిపోగా వారిలో 22 శాతం మంది భారత్‌, 13 శాతం మంది నైజీరియాకు చెందినవారేనని ఐరాస పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా ఐదేళ్లలోపు చిన్నారుల మరణాల్లో ఐదోవంతు మనదేశంలోనే చోటుచేసుకుంటున్నట్టు ఐరాస నివేదిక చెబుతోంది.

1990తో పోల్చితే బాలల మరణాలు సగం వరకూ తగ్గాయని, ఇది నిజంగా శుభసూచికమే అయినా ఈ పరిస్థితిని మరింత మెరుగుపరచాలని, ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలను నిలబెట్టగలిగామని యునిసెఫ్‌ కార్యనిర్వాహక సంచాలకుడు లేక్‌ అన్నారు. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న శిశు మరణాల్లో సగానికిపైగా భారత్‌, చైనా, కాంగో, నైజీరియా, పాకిస్థాన్‌ దేశాల్లోనే చోటుచేసుకుంటున్నట్టు ఈ నివేదిక పేర్కొంది. నెలలు నిండకముందే పుట్టడం, ఊపిరితిత్తులు వాచిపోవడం, శ్వాస స్తంభించడం, నీళ్ల విరేచనాలు, మలేరియా, పౌష్టికాహార లోపం వంటి పలు కారణాలవల్లే శిశు మరణాలు చోటుచేసుకుంటున్నాయని, తల్లీబిడ్డలకు కనీస వైద్యం అందించడం ద్వారా కూడా చాలామందిని రక్షించవచ్చని యునిసెఫ్‌ నివేదిక పేర్కొంది.

  • Loading...

More Telugu News