: ఏకాభిప్రాయంతోనే మోడీ ఎంపిక
వచ్చే ఎన్నికలకు బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీ ఎంపిక ఏకాభిప్రాయంతోనే సాధ్యమయిందని పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, పార్టీలోని నేతలందరినీ సంప్రదించాకే మోడీ పేరును అధికారికంగా ప్రకటించామని ఆయన తెలిపారు. ఇక, అద్వానీ ఈ విషయంలో విముఖంగా ఉన్నా, ఆయన మార్గదర్శకత్వంలోనే తాము పనిచేస్తామని రాజ్ నాథ్ పేర్కొన్నారు.