: బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీ


బీజేపీ దూకుడు ప్రదర్శించింది. నరేంద్ర మోడీని ప్రధాని అభ్యర్థిగా బీజేపీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. ఢిల్లీలో జరుగుతున్న బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. మోడీ అభ్యర్థిత్వానికి పార్లమెంటరీ బోర్డు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు కూడా మోడీకి ఓకే చెప్పాయి. కాగా, మోడీ ప్రధాని అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తున్న అగ్రనేత అద్వానీ పార్లమెంటరీ బోర్డు సమావేశానికి గైర్హాజరైన సంగతి తెలిసిందే. కాగా, ప్రధాని అభ్యర్థిగా ఎన్నికైన మోడీకి పార్టీ నేతలు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ మోడీకి మిఠాయిలు తినిపించారు.

  • Loading...

More Telugu News