: తాగి పాఠశాలకు వెళ్లి సస్పెండయిన 9వ తరగతి విద్యార్ధి
బుద్ధిగా చదువుకోవాల్సిన ఓ విద్యార్ధి పాఠశాలకు తాగి వచ్చాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు వెంటనే సస్పెండ్ చేశారు. కేరళలోని ట్యూటికోరన్ జిల్లాలోని కళుగుమలైలోని ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్ధి తాగి పాఠశాలకు వచ్చాడు. అదేరోజు పాఠశాలలో క్వార్టర్లీ పరీక్షలు జరుగుతున్నాయి. విద్యార్ధి పరీక్ష రాస్తుండగా దగ్గరకు వెళ్లిన స్కూల్ ప్రిన్సిపాల్ విషయం తేడాగా ఉండడాన్ని గ్రహించాడు. దాంతో, ఆగ్రహం చెందిన ఆయన వెంటనే ఎడ్యుకేషన్ డిపార్ట్ మెంట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వెంటనే స్కూల్ కు వచ్చిన చీఫ్ ఎడ్యుకేషన్ ఆఫీసర్, తహశీల్దార్, విలేజ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ విద్యార్ధి తల్లిదండ్రుల ఎదుట పరీక్ష చేశారు. విద్యార్ధి తాగినట్లు తెలియడంతో ఇరవై రోజులపాటు సస్పెండ్ చేశారు. కానీ, తమ కుమారుడిని స్కూల్ కు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన ఈ నెల 11న జరిగింది.