: సుప్రీంలోనూ వారికి మరణశిక్షే పడాలి: జయసుధ
నిర్భయ అత్యాచార కేసులో నలుగురు నిందితులకు ఉరిశిక్ష పడడంపై సినీ నటి, సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధ స్పందించారు. దోషులు సుప్రీం కోర్టుకెళ్ళినా ఇదే శిక్ష పడాలని ఆకాంక్షించారు. సికింద్రాబాద్ లోని తన ఆఫీసులో ఈ సాయంత్రం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీ సాకేత్ ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు తెలిపారు. కేంద్రం చొరవ చూపి న్యాయనిపుణుల సలహా తీసుకుని సుప్రీంలోనూ వారికి ఇదే శిక్ష పడేలా వ్యవహరించాలని అన్నారు. కాగా, మైనార్టీ తీరలేదని మరో నిందితుడికి మూడేళ్ళు జైలుశిక్ష విధించడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.