: మోడీ పీఎం అభ్యర్ధిత్వంపై సమాయత్తమవుతున్న బీజేపీ


పలుసార్లు సమావేశాలు, చర్చల అనంతరం నరేంద్ర మోడీ ప్రధాని అభ్యర్ధిత్వంపై బీజేపీ నేడో, రేపో ప్రకటన చేయనుంది. ఈ నేపథ్యంలో ఆ పార్టీ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ కొద్దిసేపటి కిందట శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ థాకరే, ఇతరులను కలిసి మద్దతు కోరారు. ఇందుకు శివసేన కూడా మద్దతు తెలిపింది. ఇప్పటికే మోడీకి 'గుడ్ లక్' చెబుతూ ఈ ఉదయం ఉద్ధవ్ ఫోన్ చేశారు. అటు ప్రకటన వెలువడనున్న క్రమంలో మోడీ ఈ సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 17న మోడీ పుట్టినరోజు కావడంతో ఈలోపు ఈ అంశాన్ని ఓ కొలిక్కి తీసుకొచ్చి ముందురోజుకల్లా ప్రకటన చేయాలని బీజేపీ తొందరపడుతోంది. ఇదిలావుంటే మోడీని వ్యతిరేకిస్తున్న అద్వానీ, సుష్మస్వారాజ్ లను ఒప్పించాలని అటు గడ్కరీ ఆర్ఎస్ఎస్ తరపున తనదైన ప్రయత్నాలు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News