: మహిళలపై లాఠీ ఎత్తిన సీఐ
తూర్పుగోదావరి జిల్లా దొంతమూరు థర్మల్ ప్రాజెక్టు వద్ద సమైక్యాంధ్ర ఉద్యమకారులపై లాఠీ విరిగింది! దీంతో, అక్కడ ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. ఈ ఉదయం ర్యాలీగా బయల్దేరిన ఆందోళనకారులపై సీఐ సోమశేఖర్ విరుచుకుపడ్డారు. మహిళలని కూడా చూడకుండా విచక్షణారహితంగా లాఠీచార్జి చేశారు. దీంతో, మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. అనంతరం నిరసనగా ఉద్యమకారులు బిక్కవోలు ఫ్లై ఓవర్ పై బైఠాయించారు.