: అటు కేంద్ర మంత్రికి, ఇటు రాష్ట్ర మంత్రికి తప్పని సెగ
విశాఖలో కేంద్ర మంత్రి కిశోర్ చంద్రదేవ్ ఇంటిని సమైక్య విద్యార్థులు ముట్టడించారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దీంతో పలువురు విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక జిల్లాలోని పాడేరులో మంత్రి బాలరాజును సమైక్యవాదులు అడ్డుకున్నారు. ఆయన రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. కాగా, నెల్లూరు జిల్లా సూళ్ళూరుపేట నుంచి శ్రీహరికోటకు వెళ్ళే రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. షార్ కు వెళ్ళే ఉద్యోగులను విధులకు హాజరు కాకుండా వారు అడ్డుకున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యంలో పూతలపట్టు ఎమ్మెల్యే రవికి చేదు అనుభవం ఎదురైంది. సమైక్యాంధ్రకు మద్దతుగా ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను వెనక్కివెళ్ళమంటూ నినాదాలు చేశారు. అంతేగాకుండా అక్కడి షామియానాలను ధ్వంసం చేశారు.